July 02, 2014

FLAX LEAVES CURRY (AVISE AKU KURA)

                                       అవిసి ఆకు కూర 

కావలిసిన వస్తువులు:
అవిసె ఆకు - 250 గ్రా
కంది పప్పు - 100 గ్రా
పచ్చి - కొబ్బరి - అర చిప్ప
పచ్చి మిర్చి - 15 కాయలు
చింత పండు పులుసు - 2 tbsp
పంచదార - 1/2 tsp
పసుపు 1/2 tsp
ఉప్పు -  సరిపడినంత
మినప పప్పు - 1/2 tsp
- మెంతులు - 1/4 tsp
జీలకర్ర - 1/4 tsp
ఆవాలు - 1/4 tsp
కరివేపాకు
కొత్తిమీర
నూనె - 1 1/2 tbsp

తయారీ:

  • అవిసె ఆకూ ఉడికించి నీళ్ళు  వంచి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. 
  • కంది పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
  • కొబ్బరి, మిర్చి, పసుపు, ఉప్పు, చింత పండు కలిపి మెత్తగా రుబ్బుకొవాలి. 
  • బాణలిలో నూనె పోసి మినప పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 
  • తరువాత కొబ్బరి ముద్ద, పప్పు, ఆకు వేసి 5 ని లు సన్నని సెగ మీద ఉడికించాలి. 
  • చివరకి దించేముందు కొత్తిమీర జల్లి దించుకోవాలి



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0