May 22, 2015

PANASA THONALA THANDRA

                                               పనస తొనల తాండ్ర 

కావలిసిన వస్తువులు:
పనస తొనలు - 60
పంచదార - 125 గ్రా
ఏలకుల పొడి - 1/2 tsp

తయారీ:

  • పనస తొనలు తీసుకొని లోపలి గింజలు, పొరలు తీసి వేసి, ఒక గిన్నిలో వేసి పావులిటరు నీళ్ళు పోసి ఉడకపెట్టాలి. 
  • ముక్క బాగా మెత్త పడిన తరువాత దించి కొద్దిగా ఆరిన తరువాత మెత్తగా రుబ్బి,  ఒక స్టీల్ పళ్ళెం లో కొద్దిగా  నెయ్యి రాసి కొంత  పనస ముద్ద వేసి  సమంగా చేసి కాసేపు ఆరనివ్వాలి. 
  • తరువాత పంచదార, ఏలకుల పొడి వేసి దాని మీద అద్ది ఇలాగే 4 లేక 5 తడవలు దాని మీదనే చెయ్యాలి. 
  • బాగా ఆరి, ఎండిన తరువాత ముక్క కోసి డబ్బాలో పెట్టుకోవాలి. 
  • ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0