November 20, 2015

JANGIRI

           జాంగిరి 

కావలిసిన వస్తువులు:
మినపప్పు - 250 గ్రా 
పంచదార - 500 గ్రా 
డాల్డా/ నూనె - 500 గ్రా
 రోజ్ ఎసెన్స్ - కొద్దిగా 
దళసరి బట్ట - పావు మీటర్ 
ఆరంజ్ కలర్ - కొద్దిగా 

తయారీ:

  • మినపప్పు ఒక గంట సేపు మాత్రమే నానపెట్టి శుబ్రంగా కడుగుకోవాలి. దీనిని గారెల పిండిలా మెత్తగా, గట్టిగా  రుబ్బుకోవాలి. అందులో   కలర్ వేసి ఒకసారి రుబ్బి  గిన్నిలోకి తీసుకోవాలి. 
  • పంచదారలో రెండు గ్లాస్ ల నెలలు పోసి, బాగా తీగ పాకం వచ్చేవరకు కాయాలి. 
  • బట్ట తీసుకొని మధ్యలో రంధ్రం చేసి, దాని చుట్టూ దారంతో గట్టిగా కుట్టాలి. 
  • పొయ్యి మీద డాల్డా/నూనె వేసి బాగా మరగనిచ్చి బట్టని తడిపి అందులో కొద్దిగా పిండి పెట్టి మరిగే డాల్డాలో ముందర ఒక చక్రం ఆకారంలో చుట్టి దానిమీద దగ్గరదగ్గరగా చిన్న చక్రాలు పిండుతూ జాంగిరిని చుట్టి రెండు వేపులా వేగనిచ్చి తీసి పాకంలో వేసి ఒక నిముషం వుంచి తీసుకోవాలి. 
  • ఈవి చాలా రుచిగా ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0