October 29, 2016

VANKAYA - MULAKKAYA PULUSU (BRINJAL AND DRUMSTICK SWEET AND SOUR CURRY)

      వంకాయ - ములక్కాయ పులుసు 

కావలిసిన వస్తువులు:
వంకాయలు - 250 గ్రా 
ములక్కాయ - 1
ఉల్లిపాయ  - 1
పచ్చిమిర్చి- 2
చింత పండు గుజ్జు - 2-3 tbsp 
పసుపు - 1/4 tsp 
ధనియాలు-జీలకర్ర పొడి - 1/2 tsp 
ఉప్పు- సరిపడా 
కారం - 2 tsp 
బెల్లం - చిన్న ముక్క 

తాలింపు:
నూనె/ నెయ్యి - 1 tbsp 
ఎండు మిర్చి - 2
వెల్లులి రేకలు - 4
మెంతులు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:

  • ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ములక్కాయ 2" ముక్కలుగా కోసుకోవాలి. 
  • చిన్న వంకాయలు అయితే గుత్తులుగా, పొడవు వంకాయలు అయితే ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉంచుకోవాలి. . 
  • బాణలిలో నూనె/ నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత ఉల్లిపాయ, మిర్చి, వంకాయలు, ములక్కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. 
  • ముక్క కొద్దిగా మగ్గిన తరువాత ధనియాల పొడి, కారం బెల్లం, చింతపండు గుజ్జు, ఒక కప్ నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 
  • పులుసు కొద్దిగా చిక్కపడినాక దించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0